ఉత్తమ ఫలితాలు వచ్చేలా బోధించాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:23 PM
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యం వారిలో పెంపొందేలా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని కలెక్టర్ సంతోష్ చె ప్పారు.
ఎర్రవల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యం వారిలో పెంపొందేలా ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలని కలెక్టర్ సంతోష్ చె ప్పారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కస్తూర్బాగాంధీ, పదో బెటాలియన్‌లో ఉన్న జడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదు ల్లోకి వెళ్లి పలువురు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు అర్థం చేసుకుని పరీక్షల్లో ప్రతిభ చాటాలని విద్యార్థులకు సూచించారు. దసరా సెలవులు ముగిసినప్పటికీ విద్యార్థులు రాకపోవడంపై ప్రశ్నించారు. హాజరుశాతం పెరగాలని సూచించారు. జిల్లాలోని అన్ని కస్తూర్బాలలో కంప్యూటర్ తరగతులు నిర్వహించాలని డీఈవో విజయలక్ష్మిని ఆదేశించారు. కంప్యూటర్లు మంజూరైనప్ప టికీ తరగతులు ప్రారంభం కాకపోవడంపై ఎస్‌వోను ప్రశ్నించారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని, స్టోర్ రూం, మెనూను పరిశీలించారు. కేజీబీవీలో సమస్యలను ఉపాధ్యాయినీలు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం ఎర్రవల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి హంపయ్య, ప్రత్యేకాధికారి స్వర్ణలత, ఉపాధ్యాయుడు మహబూబ్‌పాష పాల్గొన్నారు.