Share News

టెర్రరిస్టులతో చర్చలు.. మావోయిస్టులపై కాల్పులా

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:07 PM

టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్న కేంద్ర దోపిడీ పాలకవర్గాల చేతిలో తరతరాల నుంచి నలిగిపోతున్న పీడిత ప్రజల కోసం సిద్ధాంత ప్రాతిపదికన పనిచేస్తున్న మావోయిస్టులు శాంతిచర్చలకు పిలుపునిచ్చినా పట్టించుకోలేదు.

 టెర్రరిస్టులతో చర్చలు.. మావోయిస్టులపై కాల్పులా
మాట్లాడుతున్న సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

- సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

పాలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్న కేంద్ర దోపిడీ పాలకవర్గాల చేతిలో తరతరాల నుంచి నలిగిపోతున్న పీడిత ప్రజల కోసం సిద్ధాంత ప్రాతిపదికన పనిచేస్తున్న మావోయిస్టులు శాంతిచర్చలకు పిలుపునిచ్చినా పట్టించుకోలేదు. బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో మావోయిస్టులను అంతం చేయటం విషాదకరమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం సీపీఐ శతవసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన సీపీఐ బస్సు ప్రచార జాతా జిల్లా కేంద్రానికి చేరుకుంది. ప్రచార జాతాకు సీపీఐ శ్రేణులు బతుకమ్మలు, అరుణ పతాకాలతో స్వాగతం పలికి ఊరేగింపు చేపట్టారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ ముష్కరుల నుంచి స్వాతంత్య్రం కావాలని సీపీఐ నాయకత్వంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. బ్రిటీష్‌ వాళ్లకు ఊడిగం చేసిన చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉందన్నారు. మోదీ, అమిత్‌షా కమ్యూనిజాన్ని, లౌకిక సోషలిజ భావజాలాన్ని అంతం చేయలేరన్నారు. 75ఏళ్ల భారతావనిలో నిరుద్యోగం, ఆకలి, పేదరికం, దారిద్య్రం తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహా, జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, పరమేశ్వర్‌గౌడ్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్‌, పి.సురేష్‌, డి.రాము, అల్వాల్‌రెడ్డి, కె.పద్మావతి, కె.నరసింహా, భాష, గంటల శ్రీను, రాజు, లక్ష్మణ్‌, రాజశేఖర్‌, మహేష్‌, జగన్‌, గణేష్‌, ప్రవీణ్‌, వెంకన్న, భాస్కర్‌, జాను, లింగం, దేవానంద్‌, గోపాల్‌, అంజి, జగన్‌, యాదయ్య, మణ్యం, మాదగిరి, ఇందిర, చెన్నమ్మ, శేఖర్‌, దినకర్‌, రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:07 PM