కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:14 PM
అ లంపూర్ మండలం క్యాతూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.
క్యాతూరులో మొక్కజొన్న కొనుగోలును ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అ లంపూర్ మండలం క్యాతూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొ క్కజొన్నను మద్దతు ధర రూ.2,400లకు కొనుగో లు చేస్తుందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలని సూచించారు. తేమశాతం 14వరకు ఉంటే ఎకరాకు 25 క్వింటా ళ్ల వరకు కొనుగోలు చేస్తారని చెప్పారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతు లు సీసీఐ ఏర్పాటు చేసిన మిల్లులోనే విక్రయించుకోవాలని సూచించారు. అనంతరం మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మక్కల కొనుగోలు, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్‌చైర్మన్ కుమార్, పీ ఏసీఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మార్కెఫెడ్ డీఎం, భీమవరం చంద్రశేఖర్‌రెడ్డి, నర్సన్‌గౌడ్, మద్దిలేటి, రమణ, నరేంద్ర ఉన్నారు.