Share News

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:38 PM

మైనార్టీ కార్పొరేషన్‌ అం దించే కుట్టు మిషన్లను ముసిం్ల మహి ళలు సద్వినియోగం చేసుకోవాల ని అ లంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళకు కుట్టు మిషన్‌ సామగ్రి ఇస్తున్న ఎమ్మెల్యే విజయుడు

  • కుట్టు మిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయుడు

వడ్డేపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మైనార్టీ కార్పొరేషన్‌ అం దించే కుట్టు మిషన్లను ముసిం్ల మహి ళలు సద్వినియోగం చేసుకోవాల ని అ లంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి విడుద లైన కుట్టు మిషన్‌లను మంగళవారం శాంతినగర్‌ భవానీ ఫంక్షన్‌ హాల్‌లో మహిళలకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌లతో కలి సి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముస్లిం మహిళలకు ఒక అన్నగా, ఒక తమ్ము డిగా అండగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన నిధుల మంజూ రుకు, పథకాలను అమలుకు తనవంతు గా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివ రకు మహిళలకు అందాల్సిన పథకాలను సక్రమంగా అమలుచేయాలని అధికారు లను, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు. అలంపూర్‌ నియోజక వర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడి పిస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:38 PM