జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:16 PM
నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చే సుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఉపాధికల్పన అధికారి డాక్టర్ ప్రియాంక అన్నా రు.
జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక
గద్వాల న్యూటౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు జాబ్‌మేళాను సద్వినియోగం చే సుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఉపాధికల్పన అధికారి డాక్టర్ ప్రియాంక అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో నిరుద్యోగులకు మూడు కంపెనీలలో ఖాళీలకు సంబంధించి జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాబ్‌మేళా ద్వారానే ఉద్యో గ అవకాశాలు వస్తాయన్నారు. ప్రతీ ఒక్క నిరుద్యోగి జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని ఉ న్నతంగా రాణించాలన్నారు. మొత్తం 144 ఖాళీ లు ఉండగా బుధవారం ఒక్కరోజే 48మంది జా బ్‌మేళాకు హాజరుకాగా ఇందులో తొమ్మిది మం ది ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. కార్య క్రమంలో కాసం ఫ్యాషన్ సీఈవో శ్రీధర్, పుష్కర్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రాజేంద్రప్రసాద్, పీఎంకే కే, ఉపాధి కల్పన శాఖ సిబ్బంది ఉన్నారు.