రాజకీయ సేవకు ప్రతిఫలం సస్పెన్షన్
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:30 PM
రాజకీయ సేవలో తరించేందుకు వెళ్లిన ముగ్గురు అర్చకులపై వేటుపడింది.
జోగుళాంబ అర్చకులపై వేటు
అలంపూరుచౌరస్తా, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): రాజకీయ సేవలో తరించేందుకు వెళ్లిన ముగ్గురు అర్చకులపై వేటుపడింది. సహకరిం చిన ఈవోపై కుడా చర్యలు తీసుకుంటూ ఉ త్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. శ్రీజోగు ళాంబ ఆలయంలో పనిచేసే ప్రముఖ అర్చకు లు విక్రాంత్‌శర్మ, వెంకటస్వామి, కృష్ణమూర్తి ఈనెల 6న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోదరుడి కూతురికి బుగ్గన రాజేందర్ కుమా రుడికి డోన్ పట్టణంలో జరిగిన వివాహంలో ఆశీర్వచనాలు అందిస్తూ కనిపించారు. నిబం ధనల ప్రకారం ఆలయ అర్చకులు ప్రైవేట్ కా ర్యక్రమాల్లో పాల్గొనరాదు. కానీ ఇవేవీ పట్టిం చుకోకుండా వెళ్లినందుకు వారికి ఇటీవల నో టీసులు జారీ చేసింది. తాజాగా ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు బాధ్యుడిని చేస్తూ ఈవో పురేందర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. రాజకీయ సేవకు ప్రతిఫలమే ఈ చర్యలు అ ని భక్తులు భావిస్తున్నారు. పురేందర్ స్థానం లో గంగాపురం ఆలయ ఈవోగా ఉన్న దీప్తిని ఇక్కడకు బదిలీ చేశారు.