Share News

విమర్శకులకు అందని సురవరం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:29 PM

విమర్శకులకు అందని నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని మాజీ మంత్రి నిరం జన్‌రెడ్డి అన్నారు.

విమర్శకులకు అందని సురవరం
‘ఎర్రపొద్దై మళ్లీ వస్తవా వీరుడా’ సీడీని ఆవిష్కరిస్తున్న నాయకులు

- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- కుగ్రామంలో పుట్టి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన నేత

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

అలంపూరు చౌరస్తా, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : విమర్శకులకు అందని నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని మాజీ మంత్రి నిరం జన్‌రెడ్డి అన్నారు. సోమవారం సురవరం స్వగ్రామమైన జోగుళాంబ గద్వాల జిల్లాలోని కంచుపాడులో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ర్టాల వామపక్ష ముఖ్య నాయకులు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహ, ఉమ్మడి జిల్లా కార్యదర్శులు, ప్రజ లు హాజరయ్యారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ 60ఏళ్ల పాటు ఎర్ర జెండాను మోసిన ఆయన అందరూ మెచ్చే నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లడుతూ.. కుగ్రామం లో పుట్టి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహానీయుడు సురవరం అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభు త్వం తీసుకుంటుందన్నారు. కంచెపాడు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.3కోట్ల నిధులు, గ్రామంలో పాఠశాలను హైస్కూలుగా అప్‌ గ్రేడ్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోల ను సురవరం సతీమణి విజయలక్ష్మికి అందజేశారు. అదేవిధంగా గ్రా మంలోని ఐదుగురికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశా రు. సురవరం సతీమణి విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున సంపత్‌కుమార్‌ వచ్చి గ్రామాభివృద్ధి జీవో కాపీల ను అందజేయడం శుభపరిణామం అని అన్నారు. రచయిత శ్యామల రాసిన ‘ఎర్రపొద్దై మళ్లీ వస్తవా వీరుడా.. ఎర్రజెండాను అలుముకుంటా వా’ అనే పాట సీడీని నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:29 PM