Share News

తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 03 , 2025 | 10:33 PM

మొంథా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. శ్రీరాంనాయక్‌ డిమాండ్‌ చేశారు.

తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరాంనాయక్‌

అలంపూరు చౌరస్తా, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. శ్రీరాంనాయక్‌ డిమాండ్‌ చేశారు. జోగుళాంబ గద్వాలజిల్లా అలంపూరు చౌరస్తాలో కమిటీ సభ్యులు మద్దిలేటి ఆధ్వర్యంలో సోమవారం నిర్వ హించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం పత్తిని కొనాలని, మాయిశ్చర్‌ పేరుతో తిప్పిపం పితే సహించేది లేదన్నారు. జీవోలతో బీసీల రిజర్వేషన్‌ సాధ్యం కాదన్నారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల రాష్ర్టా నికి రావాల్సిన రూ.మూడువేల కోట్లు రావడంలే దని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యద ర్శి వెంకటస్వామి, రాజు, నరసింహ, ఈదన్న, రమేశ్‌, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 10:33 PM