రాజ్యాంగ పరిరక్షణకు సహకారం
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:44 PM
రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఎంత వరకైనా పోరాటం చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పాలమూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఎంత వరకైనా పోరాటం చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాల యంలో రాజ్యాంగ హక్కుల సాధనకోసం నవం బర్ 26న ‘చలో ఢిల్లీ’ జాతీయ మాలమహా నాడు కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రాజ్యాంగ హక్కులను సాధించటానికి జాతీయ మాలమహానాడు చలో ఢిల్లీ చేపట్టిందని రాష్ట్ర కో ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి తెలిపారు. రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విద్యా ర్థులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో గం డీటి చిన్న, పత్తి మహేందర్, గోనెల ఆనంద్, బెండ మున్నయ్య, టంకర శ్రీనివాస్, యాదగిరి, హరీశ్, పత్తిశివకుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.