పండ్ల తోటల పెంపకానికి తోడ్పాటు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:51 PM
పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ అన్నారు.
- గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్
- మాచారంలో చెంచులు సాగు చేసిన తోటల పరిశీలన
- మన్ననూరు గిరిజన విద్యాలయం తనిఖీ
మన్ననూర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఇందిర సౌరగిరి జల వికాసం పథకం ద్వారా చెంచు రైతులు సాగు చేస్తున్న పండ్ల తోటలను బుధవారం ఆయన పరిశీ లించి, వారితో మాట్లాడారు. తమకు ట్రాక్టర్‌ను సమకూర్చి, వ్యవసాయ పరికరా లను అందించాలని వారు ఆయనను కోరారు. అనంతరం మాచారంలోని కోదండ రామాలయాన్ని సందర్శించారు. అంతకు ముందు మన్ననూరులో ఆదిమవాసీ గిరిజన విద్యాలయం (పీటీజీ)ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసి న వాటర్‌ప్లాంటును పరిశీలించారు. వసతులపై అధికారులు, సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులతో సమావేశ మయ్యారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, క్రమ శిక్షణతో విద్యాభ్యాసం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అనూష ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ జలంధర్ రెడ్డి, మాజీ సర్పంచులు పెద్దిరాజు, పద్మ, రైతులు అలివేల, లక్ష్మయ్య, మల్లయ్య, గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త సుధాకర్, ఏపీవో యాదమ్మ, ప్రిన్సిపాల్ నిమ్మల పద్మావతి పాల్గొన్నారు.