శతాబ్ది ఉత్సవాలకు సహకారం అందిస్తా
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:29 PM
బాదేపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ధి ఉత్సవాలకు పూర్తిసహాయ సహకారాలు అంది స్తానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : బాదేపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ధి ఉత్సవాలకు పూర్తిసహాయ సహకారాలు అంది స్తానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల బాలుర ఉత్సవ కమిటీ నాయ కులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని ఆయన స్వగృ హంలో కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానిం చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఉత్సవాలను విజయవంతం చేసుకుందామన్నారు. తమ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. హైస్కూల్ అభివృద్ధికి తనవంతు భాగస్వామాన్ని అందిస్తా నని గుర్తు చేశారు. లక్ష్మారెడ్డిని కలిసిన వారిలో కమిటీ ప్రధాన క్యారదర్శి రమణాచార్యులు, ఉపాధ్యక్షుడు సత్యం, సయ్యద్ ఇబ్రహీం, ఆనంద్, పరమటయ్య, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.