Share News

సూపర్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీ ప్రారంభం

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:16 PM

క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

 సూపర్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీ ప్రారంభం
బ్యాటింగ్‌ చేస్తూ క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం పట్టణంలో మక్తల్‌ సూపర్‌ ప్రీమియర్‌ లీగ్‌ పో టీలను ఎమ్మెల్యే క్రికెట్‌ ఆడి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా భావించాలన్నారు. మొదటి బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.40 వేలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కోళ్ల వెంకటేష్‌, సీఐ రాంలాల్‌, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కట్ట సురేష్‌కుమార్‌ గుప్తా, చంద్రకాంత్‌గౌడ్‌, కల్లూరి హన్మంతు, బి ల్డర్‌ తాయప్ప, రహీంపటేల్‌, కావలి ఆంజనేయులు, లక్ష్మణ్‌, శంశొద్దీన్‌, కావలి శ్రీహరి, క్రికె టర్‌ ఆంజనేయులు, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:16 PM