చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - May 31 , 2025 | 11:17 PM
చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం నాగార్జున రావుతో శ నివారం ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని కార్యా లయంలో సమావేశమయ్యారు.
ఆత్మకూరు, మే 31 (ఆంధ్రజ్యోతి) : చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం నాగార్జున రావుతో శ నివారం ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని కార్యా లయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ... చెరకు రైతులకు ఇ వ్వాల్సిన విత్తన సబ్సిడీ బిల్లులు, లేబర్ ట్రాన్స్ పోర్ట్ బిల్లులు, షూరిటీ రైతు ఖాతాల్లో తక్షణ మే జమ చేయాలని కోరారు. కోతలకు సరిపడా కార్మికులకు అడ్వాన్సులు చెల్లించి త్వరగా ర ప్పించాలని కోరారు. రైతులకు లాభాలు వచ్చే లా మేలు రకమైన చెరకు విత్తనాన్ని పంపిణీ చేయాలన్నారు. ఆత్మకూరుతో పాటు శాంతిన గర్ జోన్‌లో చెరకు పంట అభివృద్ధికి కృషి చేసి పరిశ్రమకు కావాల్సినంత చెరకు నాలుగు నుం చి ఐదు లక్షల టన్నులు వచ్చేలా యామాన్యం అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రైతులను నష్టపరుస్తున్న తెగుళ్లు వేరు పురుగు నివారణ చర్యలు చెరకు ఫ్యాక్టరీ యా జమాన్యం తీసుకోవాలని కోరుతూ.. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీజీఎంకు వినతిపత్రం అందజేశారు. రాజన్న, వాసిరెడ్డి, లింగన్న, చెరు కు రైతులు తిరుపత య్య, శ్రీనివాసులు, రాజశే ఖర్ రెడ్డి, గోపాల్, గోవింద్, నల్లారెడ్డి తదిత రులు పాల్గొన్నారు.