Share News

విజయవంతమైన మినీ జాబ్‌మేళా

ABN , Publish Date - May 24 , 2025 | 11:27 PM

జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మినీ జాబ్‌మే ళా విజయవంతం అయినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్‌ ప్రియాంక తెలిపారు.

విజయవంతమైన మినీ జాబ్‌మేళా

గద్వాల న్యూటౌన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మినీ జాబ్‌మే ళా విజయవంతం అయినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్‌ ప్రియాంక తెలిపారు. ఇందు లో మొత్తం పోస్టులు 115 ఉండగా, నిరుద్యోగు లు 68 మంది హాజరయ్యారు. దాదాపు వంద మందికి పైగా అభ్యర్థులు వచ్చినప్పటికీ సకాలంలో రిజిస్ర్టేషన్‌ చేసుకోకపోవడంతో వారు ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలారు. ఇందులో వివిధ కంపెనీలకు సంబంధించి 36మంది సెలక్ట్‌ కాగా ఇందులో మొదటగా 15మంది ఉద్యో గం చేసేందుకు ఒప్పుకున్నారు, మిగితా వారు కూడా రెండు, మూడు రోజుల్లో ఉద్యోగంలో చేరతారని అన్నారు. సెలక్ట్‌ అయిన వారికి త్వరలోనే ఆఫర్‌ లెటర్స్‌ పంపుతామని తెలిపారు.

Updated Date - May 24 , 2025 | 11:27 PM