ప్రణాళికాబద్దంగా చదవాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:06 PM
విద్యార్థినులు ప్రణాళికాబద్దంగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చని ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల సూచించారు.

- ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల
- పదో తరగతి విద్యార్థినులకు సూచనలు
- శనివారం కస్తూర్భా పాఠశాలలో బస
మరికల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు ప్రణాళికాబద్దంగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చని ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల సూచించారు. శనివారం రాత్రి ఆమె మరికల్ మండలం పసుపుల గ్రామంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బస చేసిన ఆమె విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థినులు భయాన్ని వీడి పట్టుదలతో కష్టపడి చదవాలని సూచించారు. పరీక్షలంటే భయపడొద్దని, ప్రణా ళికాబద్దంగా చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీఈవో గోవిందరాజులు, ఎంఈవో అంజలీదేవి, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.