మట్టి నమూనాలపై విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:03 PM
మండల పరిధిలోని బీచుపల్లి గురుకుల, జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలపై అవగాహన కల్పించారు.
హాజరైన ఆత్మ పీడీ జగ్గునాయక్
ఎర్రవల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బీచుపల్లి గురుకుల, జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ పీడీ జగ్గునాయక్ హా జరయ్యారు. ఈసందర్భంగా వ్యవసాయ భూముల్లో మట్టి నమూనాలు తీసి పరీక్షలు ఎలా చేయాలనే అంశంపై విద్యార్థులకు సవివరంగా తెలిపారు. క్షేత్రస్థాయిలో మట్టి నమూనాలను సేకరించే విధానంపై సలహాలు, సూచనలు చేశారు. ఈ పరీక్షల ద్వారా రైతులు తమ పొలంలో సూక్ష్మ, స్థూల పోషకాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రధానంగా ఎకరం భూమిలో 8నుంచి 10 చోట్ల మట్టిని తీసుకుని 500 గ్రాముల మట్టితో పరీక్షను చేయవచ్చన్నారు. సేకరించిన మట్టి నమూనాపై రైతు వివరాలు నమోదు చేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ రైతు భూసార పరీక్షలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేశ్‌గౌడ్, ఏఈవో నరేశ్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.