Share News

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:34 PM

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రూరల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించు కొని శుక్రవారం వనపర్తి మెడికల్‌ కళాశాల సమీపంలో ఉన్న బాలసదనంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న చిన్నారుల తో కలిసి కేక్‌కట్‌ చేయించి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, ఆయనకు చి న్నారులు అంటే అమితమైన ప్రేమ ఉండేదని, ఆయన జయంతిని బాలల దినో త్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా వివిధ విభాగాలలో నిర్వ హించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అంద జేశారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ అధికారిని సుధారాణి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, తహసీల్దార్‌ రమేశ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 11:34 PM