Share News

సమ సమాజం కోసం విద్యార్థులు పోరాడాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:33 PM

సమాజం లో కుల, మత ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం కోసం వి ద్యార్థులు పోరాడాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫె సర్‌ చింతకింది కాశీం విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సమ సమాజం కోసం విద్యార్థులు పోరాడాలి
సభలో మాట్లాడుతున్న కాశీం

  • ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చింతకింది కాశీం

వనపర్తి విద్యావిభాగం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : సమాజం లో కుల, మత ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం కోసం వి ద్యార్థులు పోరాడాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫె సర్‌ చింతకింది కాశీం విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల గ్రౌండ్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి అధ్యక్షతన పీడీఎస్‌యూ తెలం గాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొద టి రోజు నిర్వహించిన విద్యార్థుల బహిరంగ సభలో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జీరెడ్డి నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో 1947లో ఏర్పడ్డ పీడీఎస్‌యూ విద్యార్థి సంస్థ విద్యార్థులు ఎదుర్కొం టున్న మౌలిక సమస్యల పరిష్కారంతో పాటు విద్య ప్రైవేటీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఉద్యమాలను నిర్మించింద ని కొనియాడారు. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో ఆదివా సీలకు జరిగిన అన్యాయంపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ఎదురొడ్డి నిలిచి పోరాడటంతోనే సమాజంలో మార్పు మొదలైందన్నారు. జార్జిరెడ్డికి చదువుకొని సైంటిస్టు అయ్యే అవకాశం ఉన్నా వదులుకున్నారన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడారన్నారు. పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్‌ రాఘవ చారి మాట్లాడుతూ... విద్యను మరింత వ్యా పారమయంగా మార్చడానికి డబ్ల్యూటీవో గాట్స్‌ ఒప్పందాల అమలు కు ప్రపంచ బ్యాంకు భారత పాలకవర్గాలపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తున్నదన్నారు. అందు వల్లనే దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ కార్పోరేట్‌ యూనివర్సిటీలకు గేట్లు బార్లా తెరుస్తున్నారన్నారు. పీడీ ఎస్‌యూ జాతీయ నాయకుడు విజయ్‌ క న్నా, మాజీ నాయకుడు కవి జనజ్వాల, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆరేల్లి కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సరళ, ఆంధ్ర ప్రదేశ్‌ పీడీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎండీ రఫీ, కిరణ్‌ కుమార్‌ ప్రసంగించారు. అదే విధంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌, రాష్ట్ర నాయకులు రంజిత్‌, సతీష్‌, గణేష్‌ కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:33 PM