విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:28 PM
చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
- ‘స్వచ్ఛత ఏవం’కు ఎనిమిది పాఠశాలల ఎంపిక
- మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘స్వచ్ఛత ఏవం - హరిత విద్యాలయ’కు జిల్లా వ్యాప్తంగా 1136 పాఠశాలలు పోటీ పడగా, అందులో 345 పాఠశాలలు నాలుగు స్టార్‌లు సాధించాయని తెలిపారు. వాటిలో 8 పాఠశాలలు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయన్నారు. రూరల్ విభాగం-1లో గండీడు మండలం, కొంరెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహ్మమ్మదాబాద్ మండలంలోని కంచన్‌పల్లి మండల పరిషత్ పాఠశాల, రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయి. విభాగం -2లో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం పాఠశాల, గండీడు మండలంలోని వెన్నచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భూత్పూర్ మండలంలోని తాడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. అర్బన్ విభాగం -1 లో బాదేపల్లి (తెలుగు వాడ) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, విభాగం-2లో మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని ఎదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలలకు కలెక్టర్ పురస్కారాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా పాఠశాలలు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పురస్కారాలు అందుకోవాలన్నారు. కార్యక్రమంలో అధనపు కలెక్టర్ మధుసుధన్‌నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్, అర్డీవో నవీన్, ఏఎంవో దుంకుడు శ్రీనివాస్, సీఎంవో సుధాకర్‌రెడ్డి, ఎంఈవో మంజులదేవి, జనార్దన్ ప్రధానోపాధ్యాయులు బైకాని బాలుయాదవ్, హేమచంద్రుడు పాల్గొన్నారు.