Share News

విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా చూడాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:00 PM

విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు అన్ని విషయాలను తెలియజేయలని డీఈవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని మోడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాలలో బాలికల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ప్రజ్వల ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.

విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా చూడాలి
మాట్లాడుతున్న డీఈవో ప్రవీణ్‌కుమార్‌

ఉపాధ్యాయులు వారికి అన్ని విషయాలు తెలుపాలి

డీఈవో ప్రవీణ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు అన్ని విషయాలను తెలియజేయలని డీఈవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని మోడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాలలో బాలికల సంరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ప్రజ్వల ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. జి ల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఒక్కో టీచర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సైబర్‌ ట్రాపింగ్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక నేరపూరిత చర్య అన్నారు. మొబైల్‌ వాడకం నిత్య జీవితంలో భాగం అయ్యిందని, దీని వల్ల కలిగిన నష్టాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించాలని సూచించారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం ఉందని గమనించిన వెంటనే 1098, 100, 181, 1930 వంటి టోల్‌ ఫ్రీ నెంబర్లకు కాల్‌ చేయ్యాలని టీచర్లు తెలుపాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌, జీహెచ్‌ఎం కోర్సు డైరెక్టర్‌ ఎంఏ బాసిద్‌, ప్రజ్వల ప్రాజెక్టు మేనేజర్‌ బలరామకృష్ణా, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:00 PM