Share News

గుండెపోటుతో విద్యార్థి మృతి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:28 PM

హైద రాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతు న్న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలి టీలోని కావేరమ్మపేటకు చెందిన పున్న ధనుష్‌ (17) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో విద్యార్థి మృతి

- కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : హైద రాబాద్‌ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతు న్న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలి టీలోని కావేరమ్మపేటకు చెందిన పున్న ధనుష్‌ (17) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మాజీ వార్డు సభ్యురాలు పున్న సుధా కాశీవిశ్వ నాథ్‌ కుమారుడు మృతి చెందడం, మృతదేహం ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి శని వారం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థి అకాల మృతి పై సంతాపం వ్యక్తం చేశారు. కష్టసమయంలో ఉన్న కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

విద్యార్థి నేత్రాలను దానం చేసిన తల్లిదండ్రులు

గుండెపోటుతో మృతి చెందిన తమ కుమారుడు పున్న ధనుష్‌ నేత్రాల ను తల్లిదండ్రులు పున్న సుధా కాశీవిశ్వనాథ్‌లు దానం చేశారు. తమ కు మారుడి కళ్లు మరో ఇద్దరు కంటి చూపు కల్పించినట్లవుతుందని పేర్కొ న్నారు. అందుకుగాను రామాయమ్మ ఇంటర్నేషనల్‌ ఐ బ్యాంకుకు దానం చేశారు. పున్న ధనుష్‌ రెటీనాలను ఐ బ్యాంకు ప్రతినిధులు తీసుకెళ్లారు. పుట్టెడు దుఃఖంలో ఉండి తమ కుమారుడు నేత్రాలను దానం చేయడం పై కావేరమ్మపేట వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 27 , 2025 | 11:28 PM