Share News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 10:53 PM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గత వందేళ్లుగా పేదల పక్షాన అండగా నిలిచి అలుపెరగని, రాజీలేని పోరాటాలు నిర్వహించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు
సీపీఐ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ

- సీసీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ

నారాయణపేట టౌన్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గత వందేళ్లుగా పేదల పక్షాన అండగా నిలిచి అలుపెరగని, రాజీలేని పోరాటాలు నిర్వహించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కళాభవన్‌లో బుధవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లా డారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక హక్కులను కాలరాస్తూ నియంత పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదపై దృష్టి పెట్టిన కేంద్రం అక్కడ నివసిస్తున్న గిరిజనులను, ఆదివాసీలను, వారికి అండగా ఉంటున్న మావోయిస్టులను మట్టుపెట్టేందుకు ఆపరే షన్‌ కగార్‌ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్‌ చే స్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలకు అందని ద్రాక్షలాగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు నరసింహ, సంతోష్‌, వెంకటేష్‌, రాము, నాగరాజు తదితరులున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 10:53 PM