Share News

జోరుగా.. జీరో దందా

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:34 PM

ఉమ్మడి జిల్లాలో ఆదాయంలో నెంబర్‌ వన్‌గా ఉండే గద్వాల వ్యవసాయ మార్కెట్‌ వెనకబడిపోతున్నది.

జోరుగా.. జీరో దందా
గద్వాల వ్యవసాయ మార్కెట్‌

- వ్యవసాయ మార్కెట్‌కు తగ్గిన ఉత్పత్తులు, పడిపోయిన ఆదాయం

- గత ఏడాది వచ్చిన ఆదాయం రూ. 5.28 కోట్లు

- ఈ ఏడాది రూ.4.38 కోట్లు మాత్రమే

- పాలకవర్గంలో కమీషన్‌ ఏజెంట్లతో పాలన

- సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు

గద్వాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఆదాయంలో నెంబర్‌ వన్‌గా ఉండే గద్వాల వ్యవసాయ మార్కెట్‌ వెనకబడిపోతున్నది. గత ఏడాది రూ.5.28కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.4.38కోట్లు మాత్రమే వచ్చింది. పాలకవర్గంలో కమీషన్‌ ఏజెట్లుతో పాలన నిర్వహిస్తుండటం, జీరో దందాను ప్రోత్సహిస్తుండటంతోనే ఆదాయం పడిపోయిందనే ఆరోపణలు వస్తు న్నాయి. ఈ ఏడాది వానకాలంలో సమృద్ధిగా పంటలు పండినా ఆశిం చిన మేరకు ఉత్పత్తులు మార్కెట్‌కు రాలేదు. గత ఏడాది మార్కెట్‌కు అన్ని ఉత్పత్తులు 5,14,864 క్వింటాళ్ల రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 3,16,922 క్వింటాళ్లు మాత్రమే వచ్చిం ది. అంటే పండించిన పంట ఎక్కడపోయిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మార్కెట్‌లో జీరో దందా కారణంగానే లెక్కలు సరిగా చూపించలేదని, అందుకే మార్కెట్‌ ఆదాయం పడిపోయిందనే ఆరోప ణలు వస్తున్నాయి.

మార్కెట్‌కు తగ్గిన ఉత్పత్తులు

గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు గద్వాల, ఆలంపూర్‌ నియోజకవర్గాలతో పాటు పెబ్బేరు, ఆత్మకూర్‌ ప్రాంతాల నుంచి కూడా రైతులు పం టలు విక్రయానికి తీసుకువస్తుంటారు. ఈ ఏడా ది వేరుశనగతో పాటు వరి మార్కెట్‌కు చాలా వరకు తగ్గిపోయింది. గత ఏడాది వేరుశనగ 2,72,764 క్వింటాళ్లు రాగా ఈ ఏడాది 1,74,541 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అదేవిధంగా వరి గత ఏడాది 1,81,394 క్వింటాళ్లు రాగా ఈ ఏడాది 1,24,452 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పత్తి గత ఏడాది 19,860 క్వింటాళ్లు రాగా ఈ ఏడాది ఒక్క క్వింటాళ్లు కూడ రాలేదు. ఆముదం, కందులు గతే డాది మాదిరిగానే వచ్చాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగా ఎక్కవగా రావాల్సి ఉండ గా ఈ ఏడాది రాకపోవడంతో ఆదాయంపై ప్రభా వం పడింది.

చెక్‌పోస్టులతో పెరిగిన ఆదాయం

గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు రెండో ప్రధాన ఆదాయం చెక్‌పోస్టుల ద్వారా వస్తోంది. గతేడాది రూ.24.79లక్షలు రాగా ఈ ఏడాది రూ.56.38 లక్షలు వచ్చింది. దీనికి ప్రధాన కారణం మక్తల్‌ వైపు ఉండే కృష్ణానది బ్రిడ్జి పనుల కోసం రెండు నెలల పాటు రాకపోకలను బంద్‌ చేశారు. మక్త ల్‌, నారాయణ పేట ప్రాంతాల రైతులు నందిన్నె చెక్‌పోస్టు ద్వారా రాయిచూర్‌కు ఉత్పత్తులను తీసుకుపోవడంతో ఈ ఆదాయం వచ్చింది.

ప్రతిపాదించిన పనులకు బ్రేక్‌

గత పాలకవర్గం మార్కెట్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అభివృద్ధి పనులకు తీర్మాణాలు చేసింది. రూ.3.89కోట్లతో మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించి అనుమతులు తెచ్చుకొని టెండర్లు పిలిచింది. ఆలోపే ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్‌ పడింది. ఇప్పు డు వచ్చిన కొత్త పాలకవర్గం కూడా మార్కెట్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Mar 24 , 2025 | 11:34 PM