పకడ్బందీగా వరిధాన్యం సేకరణ
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:19 PM
వరిధాన్యం కొనుగోలు కేందాల్ర వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నిబంధనల ప్రకారం కొనుగో లు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదే శించారు.
అధికారులతో సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
రైతులకు ఇబ్బందిలేకుండా చూడాల్సిన బాధ్యత ఏఈవోలదే
గద్వాలన్యూటౌన్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): వరిధాన్యం కొనుగోలు కేందాల్ర వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నిబంధనల ప్రకారం కొనుగో లు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదే శించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రా ల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ పొలాల వద్ద ధాన్యాన్ని సరిగ్గా ఆరబెట్టుకొని కేందాల్రకు తీసుకువచ్చేలా సంబంధిత వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో ఏఈవోలదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఆయాకేంద్రాల వద్ద గ న్నీబ్యాగులు, టార్ఫాలిన్‌లు, తూకం యంత్రాలు, ప్యాడీక్లీనర్లు, తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు అన్ని రేపటివరకు(శనివారం) పూ ర్తి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరిధాన్యం సేకరణ జరగాలని సూచించారు. ఆయా మండాలాల్లో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం తీసుకువచ్చే అ వకాశం ఉందో పూర్తి వివరాలు ప్రణాళికాబద్ధం గా సిద్ధం చేసుకోవాలన్నారు. సేకరించిన ధాన్యా న్ని ఎప్పటికప్పుడు మిల్లులకు లారీల ద్వారా త రలించే విధంగా, అలాగే గోదాములలో నిల్వ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గత సీజన్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఈ సారి ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకొని అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీఎస్‌వో స్వామికుమార్, మేనేజర్ విమల, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయఅధికారి జగ్గునాయక్, కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివా స్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాసులు, అధికారులు ఉన్నారు.