Share News

ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:39 PM

వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరిధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.

ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు
అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

  • అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): 2025-26 వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరిధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీలోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు అక్టోబ రు రెండో వారంలో ప్రారంభించాలన్నారు. ఽధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని, ప్యాడీక్లీనర్‌, వేయింగ్‌, తేమ యంత్రాలు, అవసరమైన గన్ని సంచులు, టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. రైతుల వద్ద కొ నుగోలు చేసిన ఽధాన్యం వివరాలు ఎప్పటికప్పు డు ఓ.పి.ఎం.ఎస్‌లో నమోదు చేయాలని, అంత ర్రాష్ట్ర బోర్డర్స్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరుగకుండా జాగ్రత్త పడాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావు గా కొనసాగించాలన్నారు. సమావేశంలో డీఎస్‌ వో స్వామికుమార్‌, పౌర సంబంధాల జిల్లా మే నేజర్‌ విమల, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పు ష్పమ్మ, జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:39 PM