Share News

అకడమిక్‌ క్యాలెండర్‌ పకడ్బందీగా అమలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:16 PM

విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెం డర్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాల ని జిల్లా ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ ఘని సూచించారు.

అకడమిక్‌ క్యాలెండర్‌ పకడ్బందీగా అమలు

జిల్లా ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ ఘని

గద్వాల సర్కిల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెం డర్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాల ని జిల్లా ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ ఘని సూచించారు. మంగళవారం పట్టణంలోని బాలుర హైస్కూల్‌ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2024- 25లో నిర్వహించిన పరీక్షల కార్యాచరణ, ఎస్‌ ఎస్‌సీ ఫలితాలు, సెకండరీ బోర్డు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఇన్‌చార్జి డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వందశాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదుతో పాటు మెనూప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయాలని, ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫలితాలను వందశాతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ అమలులో ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, బోర్డు సభ్యులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ప్ర తాప్‌రెడ్డి, అసిస్టెంట్‌ సెక్రటరీ జహీరుద్దీన్‌, ఏసీజీఈ శ్రీనివాస్‌, ఎంఈవో అశోక్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:16 PM