తుఫాను నష్టం వివరాలు సేకరించాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:29 PM
జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాను వలన జరిగిన నష్టం వివరాలను శాఖల వారీగా తక్షణమే సేక రించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్,
నాగర్‌కర్నూల్‌టౌన్, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాను వలన జరిగిన నష్టం వివరాలను శాఖల వారీగా తక్షణమే సేక రించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం సంబంధిత శాఖల అధికారులను ఆదే శించారు. శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో తుఫాను నష్టాలపై సంబంధిత శాఖల అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా అన్ని శాఖలకు సంబంధించిన నష్టాలపై ఆరా తీశారు. శాశ్వత పనుల కోసం అంచ నాలను తయారు చేసి శనివారం సాయంత్రం నాటికి పం పాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఏ ఒక్కరికి నష్టం జరు గకుండా నష్టం వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వం అందజేసి న పార్మాట్‌లో పంపించాలన్నారు. అంతకు ముం దు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో నష్టాల వివరాలు, సహాయక చర్యలపై వివరించారు. స మావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞానేశ్వర్, పం చాయతీరాజ్ ఈఈ, ఇరిగేషన్ ఈఈ ఉన్నారు.