నడిగడ్డపై నక్కజిత్తుల రాజకీయాలు ఆపండి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:13 PM
గ ద్వాలకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ నడిగడ్డపై నక్కజిత్తుల రాజకీయ మాటలు మాట్లాడి వెళ్లాడని, ఆయన గద్వాలకు ఇచ్చిన హామీలు అధికారంలో ఉండి ఎందుకు నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ప్ర శ్నించారు.
- బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ ద్వాలకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ నడిగడ్డపై నక్కజిత్తుల రాజకీయ మాటలు మాట్లాడి వెళ్లాడని, ఆయన గద్వాలకు ఇచ్చిన హామీలు అధికారంలో ఉండి ఎందుకు నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ప్ర శ్నించారు. సోమవారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గద్వాల జరీ చీరలు ప్రపంచంలో పే రొందినవని, అటువంటి చేనేతకు చేయూత ఇ వ్వలేదని విమర్శించారు. చేనేత పార్క్ అభివృద్ధిని మీ హయాంలో మూలన పడేశారని విమర్శించారు. గుర్రంగడ్డ బ్రిడ్జిని ఏడాదిలో పూర్తి చే స్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా పూర్తి చేయలేదన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చారని కానీ నెరరవేరలేదని విమర్శించారు. గద్వాల మునిసిపాలిటీకి రూ.100కోట్లు ఇస్తామని బహిరంగ సభలో చె ప్పి హామీని తుంగలో తొక్కారని వివరించారు. నెట్టంపాడులోని 99వ, 100వ ప్యాకేజీలను పూ ర్తి చేయలేదని వివరించారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చామని చెబుతున్నారని అం దులో పేదల పట్టాలను గుంజుకొని కట్టారని గుర్తుచేశారు. నడిగడ్డలో పదేళ్లలో ఒక్క కొత్త రోడ్డైనా వేశారా అని నిలదీశారు. జిల్లాను మీరు ఇచ్చిన బిక్షంకాదని అది ప్రజల పోరాటం వల న సాధించిందని వివరించారు. మీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, నకిలీ మద్యం, న్యూ డ్ కాల్,్స పేరిట మహిళలపై అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే, శ్యామ్‌రావు, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, నాయకులు డబ్బులేటి నర్సింహ, గాం జసాయి, మోహన్‌రెడ్డి, నర్సింహ, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.