జిల్లాలో మహిళా సొసైటీల ఏర్పాటు కోసం చర్యలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 10:50 PM
జిల్లాలో మత్స్య సహకార సంఘానికి సంబంధించి మహిళా సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని మత్స్య శాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్ అన్నారు.

- మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్
నారాయణపేట న్యూటౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్స్య సహకార సంఘానికి సంబంధించి మహిళా సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని మత్స్య శాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ సహకార సంఘం కార్యవర్గ సమావేశాన్ని ఉద్ధే శించి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు ప్ర ధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మెంబర్‌షిప్ ఇప్పించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు విజయ్‌కుమార్, హన్మంతు, ఆంజనేయులు, వెంకటేష్, శ్రీనివాస్, సరోజ, ఆనంద్, ఉషనప్ప, రామకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్‌ఏ.రహిమాన్ తదితరులున్నారు.