సమస్యలపై దశలవారీగా పోరాటం
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:35 PM
అపరిష్కృతమైన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య పరిష్కారం కొరకు దశలవారీగా పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి టీ (యూఎస్‌పీసీ) నేతలు పేర్కొన్నారు.
గద్వాల సర్కిల్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): అపరిష్కృతమైన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య పరిష్కారం కొరకు దశలవారీగా పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి టీ (యూఎస్‌పీసీ) నేతలు పేర్కొన్నారు. గద్వాలలోని స్మృతివనంలో సోమవారం యూఎస్‌పీసీ జిల్లా సన్నాహక కమిటీ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ముఖ్య నేతలు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోని పలు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించుకుని పలు అంశాలపై తీర్మానం చేశారు. సమావేశానంత రం కమిటీ నాయకులు మాట్లాడుతూ బదిలీల, పదోన్నతుల ప్రక్రియ ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని, పీఆర్సీని ప్రకటించి పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని కోరారు. యూఎస్‌పీసీ ఆధ్వర్యాన దశల వారీగా కొనసాగే సమస్యల పోరాటంలో ముందుగా ఈ నెల 23, 24వ తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాల సమర్పణ, ఆగస్టు 1 జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. 23న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు గోపాల్, వెంకటరమణ, ప్రభాకర్‌శాస్ర్తి, ప్రభాకర్, ఉదయ్‌కిరణ్, హన్మంతు, చంద్రకాంత్, లక్ష్మన్, హరిబాబు పాల్గొన్నారు.