Share News

చల్లగా ఉండయ్య..

ABN , Publish Date - Apr 26 , 2025 | 10:58 PM

అది నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా.. శనివారం మిట్ట మధ్యాహ్నం వేళ.. ఎండ దంచికొడుతోంది.. అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు దాహంతో అల్లాడుతోంది.. ఎవరిని అడగాలో అర్థం కాక చుట్టూ చూసింది..

చల్లగా ఉండయ్య..
వృద్ధురాలికి బాటిల్‌లో నీళ్లు తెచ్చి ఇచ్చిన కానిస్టేబుల్‌

అది నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తా.. శనివారం మిట్ట మధ్యాహ్నం వేళ.. ఎండ దంచికొడుతోంది.. అక్కడికి వచ్చిన ఓ వృద్ధురాలు దాహంతో అల్లాడుతోంది.. ఎవరిని అడగాలో అర్థం కాక చుట్టూ చూసింది.. అక్కడే ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కనిపించాడు.. అతన్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచివచ్చినట్లయ్యింది.. అయ్యా అంటూ అతన్ని పిలిచింది.. దగ్గరగా వచ్చిన కానిస్టేబుల్‌తో దీనంగా దూపయితుంది, గుక్కెడు మంచి నీళ్లు కావాలయ్య అని అడిగింది.. వెంటనే కానిస్టేబుల్‌ దగ్గరలో ఉన్న చలివేంద్రం వద్దకు వెళ్లి, ఓ బాటిల్‌లో నీళ్లు తెచ్చి ఆమెకు ఇచ్చాడు.. దాహంతో గొంతు ఎండుకుపోయిన ఆ వృద్ధురాలు గబగబా నీళ్లు తాగింది.. తర్వాత కానిస్టేబుల్‌ వైపు కృతజ్ఞతగా చూస్తూ, చల్లగా ఉండయ్యా అని దీవించింది.. ఆ మాటలకు కానిస్టేబుల్‌ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కానిస్టేబుల్‌ మానవత్వానికి మనసులోనే సెల్యూట్‌ చేశారు..

- నారాయణపేట

Updated Date - Apr 26 , 2025 | 10:58 PM