మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:58 PM
మత్తు పదార్థాల వాడకం సర్వం నాశనానికి దారి తీస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లాలోని శాంతినగర్ సీఐ టాటాబాబు అన్నారు.
శాంతినగర్ సీఐ టాటాబాబు
అయిజ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల వాడకం సర్వం నాశనానికి దారి తీస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లాలోని శాంతినగర్ సీఐ టాటాబాబు అన్నారు. గురువారం అయిజ పట్టణంలో ని శ్రీకృష్ణ ఫంక్షన్‌హాలులో డ్రగ్స్, మత్తుపదార్థాల నివారణపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. ఏబీవీపీ అయిజ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితం నాశనం అవుతుందన్నారు. ఇతరులు అలవాటు పడితే జీవితంతో పాటు డబ్బు, ఆరోగ్యం, కుటుంబాలు నాశనం అవుతాయని విద్యార్థులకు తెలియచేశారు. వీటికి దూరంగా ఉండటం మంచిదని తె లిపారు. వీటిని వాడినా, ప్రోత్సహించిన చట్టప్ర కారం శిక్షార్హులు అవుతారని చెప్పారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న, అలాంటి వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాల న్నారు. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చక్కగా చదువుకుని భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, ట్రైనీ ఎస్‌ఐ తరుణ్‌రెడ్డి, మోటివేషన్ స్పీకర్ రవీంద్రధీర, గద్వాల జిల్లా ప్రముఖ్ ఆంజనేయులు, కన్వినర్ రఘువంశీ, కో కన్వినర్ వెంకటేష్, నగర కార్యదర్శి శ్రీధర్, సంయుక్త కార్యదర్శి నరేష్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు లోకేష్, అరవింద్‌రెడ్డి, శ్రీహ రి, రాకేష్, నిఖిల్ పాల్గొన్నారు.