Share News

నేటి నుంచి రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ టోర్నీ

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:13 PM

జిల్లా కేంద్రం లో శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియర్‌ నెట్‌ బాల్‌ టోర్నీ నిర్వహించనున్నారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ టోర్నీ
మహబూబ్‌నగర్‌ చేరిన జగిత్యాల జట్టు

- మహబూబ్‌నగర్‌ చేరుకున్న పలు జిల్లాల జట్లు

- వర్షం పడితే.. ఇండోర్‌ స్టేడియంలో మ్యాచ్‌లు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లో శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియర్‌ నెట్‌ బాల్‌ టోర్నీ నిర్వహించనున్నారు. జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో స్టేడియంలో ఏర్పాట్లు చేయగా, వర్షం కారణంగా ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండోర్‌స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటికే నారాయణపేట, మంచిర్యాల, ఆసీఫాబాద్‌, పెద్దపల్లి, జగి త్యాల జట్లు చేరుకున్నాయి. ట్రెడిషనల్‌, ఫస్ట్‌-5, మిక్స్‌డ్‌ మూడు విభా గాల్లో పోటీలు ఉంటాయి. నాకౌట్‌ పద్ధతిలో డే నైట్‌ మ్యాచ్‌లు నిర్వ హించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోటీలను అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 1,200 మంది క్రీడాకారులు, 100పైగా కోచ్‌ మేనేజర్లు, సాంకేతిక నిపు ణులు హాజరుకానున్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జట్లు ఇండోర్‌ స్టేడియంలో ముమ్మర సాధన చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు విక్రమాధి త్యారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

మహబూబ్‌నగర్‌ జట్టు వివరాలు..

బాలికల జట్టులో శమిత, లాస్య, వైష్ణవి, సరస్వతి, మణి దీపిక, సా యిప్రియ, చైత్ర, మనుశ్రీ, పూజ, సింధూజ, మమత, అనురాధ, కోచ్‌ అక్రమ్‌హుస్సేని మేనేజర్‌ షేక్‌యాస్మిన్‌. బాలుర జట్టులో అబ్దుల్లా, ర ఘు, వంశీగౌడ్‌, శ్రీనివాసులు, అప్నాన్‌, అభినవ్‌రుద్ర, వెంకటేశ్‌, జూనె ద్‌, వివేక్‌, సాయతేజచ తిరుసుర్‌నాయక్‌, కోచ్‌, అబ్దుల్‌షరీఫ్‌, మేనేజర్‌ సిద్ధార్థ ఉన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:13 PM