రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:24 PM
నగరంలోని ఇం డోర్‌స్టేడియంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియ ర్ కబడ్డీ బాలుర టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తి తెలిపారు.
- పాల్గొననున్న 34 జట్లు
- కబడ్డీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్
మహబూబ్‌నగర్‌స్పోర్ట్స్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఇం డోర్‌స్టేడియంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియ ర్ కబడ్డీ బాలుర టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. బుధవారం స్టేడియం మైదానంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ జిల్లాలో 33 జిల్లాల నుంచి 34 జట్లు పాల్గొంటాయని, దాదాపు 500కు పైగా క్రీడా కారులు, ఆఫిషియల్స్ హాజరుకానున్నట్లు తెలిపారు. 5వ తేదీ సాయం త్రం 3 గంటలకు పోటీలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శాట్స్ చైర్మన్ శివాసేనరెడ్డి హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్న ట్లు చెప్పారు. అందరి సహకారంతో టోర్నీ విజయవంతంగా నిర్వహిస్తా మని, రాష్ట్రస్థాయి టోర్నీకి కేటాయించినందుకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేష్ ముదిరాజ్, మద్ది మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులు దామోదర్‌రెడ్డి, ఉమామ హేశ్వర్‌రెడ్డి, రాంచంద్రయ్య, నర్సిములు, బాల్‌రాజ్, పాపరాయుడు, శ్రీని వాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.