నేటి నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:17 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం రాష్ట్ర స్థాయి క్రీడా సంబురానికి వేదిక కానున్నది. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకటవ తెలంగాణ అంతర్ జిల్లాల అండర్-23 3గీ3 మహిళలు, పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షి్‌ప పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
15 జిల్లాల నుంచి పాల్గొననున్న 120 మంది క్రీడాకారులు
టోర్నీని ప్రారంభించనున్న రాష్ట్ర క్రీడాశాఖ సలహాదారు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం రాష్ట్ర స్థాయి క్రీడా సంబురానికి వేదిక కానున్నది. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకటవ తెలంగాణ అంతర్ జిల్లాల అండర్-23 3గీ3 మహిళలు, పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షి్‌ప పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్‌జాకీర్, ప్రధాన కార్యదర్శి నసూరుల్లా హైదర్ మహ్మద్ ఆధ్వర్యంలో టోర్నీకి ఏర్పాట్లు చేశారు. మహిళలకు చైతన్య, పురుషులకు లిటిల్‌స్కాలర్స్ స్కూల్‌లో బస కల్పిస్తున్నారు. స్టేడియంలో భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు.
15 జిల్లాల నుంచి క్రీడాకారులు
బాస్కెట్‌బాల్ టోర్నీలో రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, జగిత్వాల, నల్గొండ, సూర్యాపేట, మెదక్, మాల్కాజ్‌గిరి జట్లు తలపడనున్నాయి. బుధవారం మ ధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న టోర్నీకి రాష్ట్ర క్రీడా శాఖ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సెక్రటరీ పృదీశ్వర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ జాబేర్‌బిన్ సయీద్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హాదీ పాల్గొననున్నారు.
పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లా బాస్కెట్ టీమ్ ఇలా..
పురుషుల జట్టు..
అబ్దుల్ బాసిత్, రోహిత్, వివేక్, ఎస్.ఆదిత్యనారయణ్
మహిళల జట్టు..
భువనేశ్వరి, అర్చిత, ప్రియాంక, తనుశ్రీ
పూర్తయిన ఏర్పాట్లు
బాస్కెట్‌బాల్ టోర్నీకి జిల్లా కేంద్రంలోని ఇన్‌డోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. 15 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు, 60 మంది సాంకేతిక నిపుణులకు బస, భోజన వసతి కల్పిస్తున్నాం. ఫ్లాష్‌లైట్ల వెలుగులో మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. అందరి సహకారంతో టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం.
- బాస్కెట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు మక్సూద్‌బిన్ అహ్మద్‌జాకీర్