రాష్ట్ర మహాసభ పోస్టర్ విడుదల
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:31 PM
ఈ నెల 25, 26 తేదీల్లో మహబూబ్‌నగర్ జ రిగే అఖిలభారత ఐక్య రైతు సంఘం తెలం గాణ రాష్ట్ర ప్రథమ మహాసభ వాల్‌పోస్టర్ ను ఆదివారం ఆ సంఘ నాయకులు విడు దల చేశారు.
అమరచింత, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 25, 26 తేదీల్లో మహబూబ్‌నగర్ జ రిగే అఖిలభారత ఐక్య రైతు సంఘం తెలం గాణ రాష్ట్ర ప్రథమ మహాసభ వాల్‌పోస్టర్ ను ఆదివారం ఆ సంఘ నాయకులు విడు దల చేశారు. ఈ సందర్భంగా మండల పరి ధిలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సం ఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజన్న మా ట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కు తక్షణమే బోనస్ డబ్బులను చెల్లించాలని, వానాకాలం ఖరీఫ్ రైతులకు అవసరమైన యూరియా ఎరువులను, పురుగు మందుల ను సబ్సిడీలో అందించాలని కోరారు. 25 నుంచి 2 రోజుల పాటు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల్లో ప్రతీ ఒక్కరు పాల్గొని జయపద్రం చేయాలని కోరారు.