Share News

శిల్పారామంలో మహిళలకు స్టాళ్లు

ABN , Publish Date - Apr 11 , 2025 | 10:55 PM

మ హబూబ్‌నగర్‌లోని శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను అక్కడ విక్రయించుకునేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు.

శిల్పారామంలో మహిళలకు స్టాళ్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): మ హబూబ్‌నగర్‌లోని శిల్పారామాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను అక్కడ విక్రయించుకునేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో ఆయన ఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఎవరికైనా అక్కడ షాప్స్‌ కావాలంటే కార్పొరేషన్‌ కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నవరత్నాల శిక్షణా కేంద్రంలో మీ అందరి సహకారంతో మొదటి బ్యాచ్‌లో 240 మంది మహిళలు వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందారని, మరో 250 మందితో రెండో బ్యాచ్‌ శిక్షణ ప్రారంభమైందని గుర్తు చేశారు. ప్రభుత్వం త్వరలోనే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుందని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీని తెచ్చి ఉచిత శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలతోపాటు వీఆర్‌ఏ, వీఆర్‌వో, టెట్‌, డీఎస్సీ వంటి వాటికి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పట్టణంలోని యువత, నిరుద్యోగులు అంబేడ్కర్‌ కళాభవన్‌లో నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్పీలకు త్వరలోనే ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తాన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 10:55 PM