ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:43 PM
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంఽధించి పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించామని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంఽధించి పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించామని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవల్లి, ఎర్రవల్లి మండలాల్లో ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 683 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామన్నారు. మూడో విడత ఎన్నికల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్, డీపీవో శ్రీకాంత్, ఈడీఎం శివ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.