ఆయిల్‌పామ్ సాగుతో స్థిర ఆదాయం
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:25 PM
ఆయిల్‌పా మ్ సాగు రైతులకు దీర్ఘకాలంగా స్థిర ఆదాయా న్ని అందించే పంటగా నిలుస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
ధరూరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పా మ్ సాగు రైతులకు దీర్ఘకాలంగా స్థిర ఆదాయా న్ని అందించే పంటగా నిలుస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం మండలంలోని ర్యాలంపాడులో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ మొక్క లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అ నంతరం మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు ప్రాధాన్యత, దీనిద్వారా రైతులకు లభించే ఆదా య మార్గాల గురించి గ్రామస్థులకు అవగాహ న కల్పించారు. ఒకసారి నాటితే కొన్నేళ్ల పాటు ఆదాయం ఇస్తుందన్నారు. ఈ పంటకు నీటి వి నియోగం కూడా తక్కువగా అవసరం ఉంటుం దన్నారు. ఉపాధి హామీ పథకం కింద నాటిన మామి డితోటను పరిశీలించారు. అనంతరం మొక్కల పెరుగుదల, నిర్వహణ, నీటి సరఫరా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, తగిన సూచన లు ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యానవ శాఖ అధికారి అక్బర్, రైతులు ఉన్నారు.