Share News

శ్రీశైలం టు హైదరాబాద్‌ రాకపోకలు ప్రారంభం

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:13 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని హైదరా బాద్‌ టు శ్రీశైలం ఎన్‌హెచ్‌ 765కే పై రాకపోకలు ఆదివారం సాయంత్రం ప్రా రంభించారు.

 శ్రీశైలం టు హైదరాబాద్‌ రాకపోకలు ప్రారంభం
మరమ్మతులు చేసిన రోడ్డుపై వెళ్తున్న వాహనాలు

ఉప్పునుంతల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని హైదరా బాద్‌ టు శ్రీశైలం ఎన్‌హెచ్‌ 765కే పై రాకపోకలు ఆదివారం సాయంత్రం ప్రా రంభించారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఉప్పునుంతల మండలంలోని లత్తీ పూర్‌ శివారులోని డిండి ప్రాజెక్టు అలుగు వద్ద శ్రీశైలం- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై 500 మీటర్లు పోడవు ఉన్న బ్రిడ్జి 500 అడుగుల మేర కోతకు గురైంది. పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అధికారులు వాహ నాలను హాజిపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు మళ్లించారు. గురువారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు రాత్రి పగలు తేడా లేకుండా మూడు రోజులు పాటు మట్టి పోసి రోడ్డు మరమ్మతులు చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి శ్రీశైలం- హైదరాబాద్‌ అచ్చంపేట హైదరాబాద్‌ తదితర ప్రాంతాల వాహనాల రాకపోకలు ప్రారంభించిన్నట్లు అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 11:13 PM