Share News

మద్దూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా శ్రీకాంత్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:03 PM

మద్దూర్‌ మునిసిపల్‌ నూతన కమిషనర్‌గా శ్రీకాంత్‌ నియమితులయ్యారు.

మద్దూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా శ్రీకాంత్‌
శ్రీకాంత్‌

మద్దూర్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మద్దూర్‌ మునిసిపల్‌ నూతన కమిషనర్‌గా శ్రీకాంత్‌ నియమితులయ్యారు. గత జనవరిలో ప్రభుత్వం మద్దూర్‌ను మునిసిపాలిటీగా అప్‌ గ్రేడ్‌ చేసింది. నూతన మునిసిపాలిటీ ఏర్పడ్డ నాటి నుంచి కోస్గి మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు ఇన్‌చార్జిగా ఉన్నారు. ప్రస్తుతం యాద్రాది జిల్లా మోత్కూరు మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్న శ్రీకాంత్‌ మద్దూర్‌కు బదిలీపై వచ్చారు. బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాంత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కమిషనర్‌కు సన్మానం

మద్దూర్‌ మునిసిపాలిటీకి నియమితులైన నూతన కమిషనర్‌ను శ్రీకాంత్‌ను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, మాజీ ఉపసర్పంచ్‌ ఉస్మాన్‌, మండల నాయకులు తదితరులు సన్మానించారు.

రెనివట్లలో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

మద్దూర్‌ మునిసిపల్‌ పరిధిలోని రెనివట్ల గ్రామంలో కొనసాగు తున్న రోడ్డు విస్తరణ పనులను మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ బుధవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారి వివ రాలను తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు గ్రామస్థులు సహకరించాలని కమిషనర్‌ కోరారు. అనంతరం గ్రామంలో ఉన్న వార్డు కార్యాలయాన్ని పరిశీలించారు. కోస్గి సీఐ సైదులు, మద్దూర్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:03 PM