ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:27 PM
గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి అన్నారు.
- మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి
నవాబ్‌పేట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సత్రోనిపల్లి తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన మైసమ్మ ఆలయ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య, మార్కెట్ చైర్మన్ హరలింగం, వైస్ చైర్మన్ తులసీరాం, వాసుయాదవ్, ఖాజ, అజహర్ పూజల్లో పాల్గొన్నారు. నాయకులు రవీందర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సింహులు, మాజీ ఎంపీపీలు అనంతయ్య, శ్రీనివాస్, కోడ్గల్ యాదయ్య, ప్రతాప్, చెన్నయ్య, చందర్‌నాయక్, రాజు, బీజేపీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మిడ్జిల్ : మండలంలోని పలు గ్రామాల్లో మృతి చెందిన బీఆర్‌ఎస్ నాయకుల కుటుంబాలను మాజీ లక్ష్మారెడ్డి పరామర్శించారు. వేముల గ్రామంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మంద భీంరాజ్ తండ్రి లాలయ్య, మసిగుండ్లపల్లిలోని బుర్రమోని యాదయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన గోదా ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జడ్పీమాజీ వైస్ ఛైర్మన్ యాదయ్య, మాజీ ఎంపీపీ సుదర్శన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు శ్రీను, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జంగారెడ్డి, సత్యనారాయణగౌడ్, జైపాల్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, మతీన్, శ్రీనివాసులు, ఆంజనేయులు, యూత్‌వింగ్ అధ్యక్షుడు బంగారు, సురేష్, మల్లేష్ ఉన్నారు.