Share News

లోక్‌ అదాలత్‌లోనే కేసుల సత్వర పరిష్కారం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:29 PM

లోక్‌ అదాలత్‌లోనే కేసులు సత్వరంగా పరిష్కా రం అవుతాయని జిల్లా న్యాయాధికారి ఎన్‌. ప్రే మలత అన్నారు.

లోక్‌ అదాలత్‌లోనే కేసుల సత్వర పరిష్కారం
లోక్‌ అదాలత్‌ గురించి వివరిస్తున్న జిల్లా న్యాయాధికారి ఎన్‌.ప్రేమలత

  • ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 139 కేసుల పరిష్కారం

  • జిల్లా న్యాయాధికారి ఎన్‌. ప్రేమలత

గద్వాల క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌లోనే కేసులు సత్వరంగా పరిష్కా రం అవుతాయని జిల్లా న్యాయాధికారి ఎన్‌. ప్రే మలత అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం లో ప్రత్యేక జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమా న్ని నిర్వహించారు. సివిల్‌ కేసులు ఐదు, క్రిమినల్‌ కేసులు 127, ఎన్‌.ఐ యాక్ట్‌ కేసులు ఏడింటిని ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించారు. ఈ సం దర్బంగా జిల్లా న్యాయాధికారి మాట్లాడుతూ ప్రత్యేక జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రజలకు తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో, సౌ హార్ధ పూర్వకంగా న్యాయం అందించడమే ప్రధా న లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌. రవికుమార్‌, పోక్సో కోర్టు జడ్జి వి. శ్రీనివాస్‌, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జ డ్జి ఎన్‌.వి.హెచ్‌. పూజిత, మొదటి అదనపు జూ నియర్‌ సివిల్‌ జడ్జి యు.ఉదయ్‌ నాయక్‌, న్యా యవాదులు, పోలీస్‌ అధికారులు, సంబంధాల విభాగాల ప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:29 PM