Share News

అతివేగమే ప్రాణాలు తీసింది

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:29 PM

ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొలెరో వాహనం అతివేగంతో ఓవర్‌టెక్‌ చేయబోయి వెనకివైపు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెంది ముగ్గురు గాయపడిన సంఘటన అడ్డాకుల మండలం జాతీయ రహదారి కందూరు స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

  అతివేగమే ప్రాణాలు తీసింది

- కందూరు స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొలెరో - ఒకరి మృతి.. ముగ్గురు ప్రయాణికులకు గాయాలు

మూసాపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొలెరో వాహనం అతివేగంతో ఓవర్‌టెక్‌ చేయబోయి వెనకివైపు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెంది ముగ్గురు గాయపడిన సంఘటన అడ్డాకుల మండలం జాతీయ రహదారి కందూరు స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అడ్డాకుల ఎస్సై ఎం.శ్రీనివాస్‌ కథనం ప్రకారం... మిర్యాలగూడ నుంచి టమాట లోడు కోసం ఏపీ రాష్ట్రం కర్నూల్‌ జిల్లాలోని పాపిలికి వెళ్తున్న బొలెరో వా హనం జడ్చర్ల వద్దకు రాగానే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరింది. 44వ జాతీయ రహదారి కందూరుస్టేజీ వద్దకు రా గానే అదేసమయంలో ముందుగా వెళ్తున్న వనపర్తి డిపో ఆర్టీసీ బ స్సును బొలెరో ఓవర్‌టెక్‌ చేయబోయి బస్సు వెనక్కి ఎడమవైపు ఢీకొ ట్టింది. దీంతో బొలెరోలో ఎడమవైపు కూర్చొన్న ప్రయాణికుడు కుమ్మ రి నాగలక్ష్మన్న(40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందా డు. అదేవిధంగా మరో ప్రయాణికుడు రఫీక్‌ తీవ్రంగా గాయపడటం తో పరిస్థితి విషమంగా మారింది. మృతుడు కుమ్మరి నాగలక్ష్మన్న ఆ త్మకూర్‌ మండలం పిన్నంచర్ల గ్రామస్థుడు. అతనికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గాయపడిన రఫీక్‌ జిల్లా వాసి. అదే విధంగా బస్సులో ఉన్న ప్రయాణికులు పెద్దమందడికి చెందిన మాధవి, స్నేహలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు.

టిప్పర్‌ ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

కోస్గి, (ఆంధ్రజ్యోతి): టిప్పర్‌, ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం కోస్గి పట్టణంలో చోటుచే సుకుంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల కథనం ప్రకారం వి వరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలానికి చెందిన మొగులప్ప (28) గత కొంతకాలంగా కోస్గి పట్టణంలోని తమ అత్తగారి పొలం దగ్గర కూరగాయలు పండించుకుంటూ భార్య అంజమ్మ, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ దివారం వ్యక్తిగత పని నిమిత్తం కోస్గి బస్టాండ్‌ వైపు నుంచి శివాజి కూడలి వైపునకు వస్తుండగా ప్రమాదవశాత్తు అటుగా పక్కనుంచి వస్తున్న మట్టి టిప్పర్‌ ఢీకొనింది. అక్కడికక్కడే మృతి చెందాడు. మొ గులప్ప మృతితో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మృతు ని భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Updated Date - Aug 17 , 2025 | 11:29 PM