Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:19 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసిం గ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి
రామనంతపూర్‌ గ్రామంలో పర్యటిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

కొత్తకోట, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసిం గ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని కొ త్తకోట మండల రామనంతపూర్‌ గ్రామంలో ఫ్రైడే డ్రైడేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేసిన వెంటనే ఫొటోలు ఆన్‌లైన్‌లో అఫ్లోడ్‌ చేసి బిల్లులు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు గ్రామ వీధుల్లో పర్యటించి పరిశుభ్రతను పరిశీ లించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సీజనల్‌ వ్యాధులను నివారించ వచ్చన్నారు. ఇళ్ల సమీపంలో మురికి నీరు ని ల్వ ఉండకుండా ప్రజలు చూసు కోవాలని పంచాయతీ అధికారులను ఆదే శించారు. ప్రజలకు ఫైడే డ్రైడేపై అవగాహన కల్పించి భాగస్వాములు చే యాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, ప్రో గ్రాం ఆఫీసర్‌ సాయినాథ్‌రెడ్డి, హౌసింగ్‌ పీడీ విఠోభా, తహసీల్దార్‌ వెంకటే శ్వర్లు, ఎంపీడీవో కృష్ణయ్య ఉన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:19 PM