లింగ నిర్ధారణ చేసే వారిపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - May 29 , 2025 | 11:11 PM
లింగనిర్ధారణ, ఆడబ్రూణహత్యలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు వారిపై చర్య లు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు.
- జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప
గద్వాల న్యూటౌన్, మే 29(ఆంధ్రజ్యోతి): లింగనిర్ధారణ, ఆడబ్రూణహత్యలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు వారిపై చర్య లు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా అడ్వజరీ కమిటీ సమావేశంలో నిర్వహించి సంబంధిత జిల్లా అ ధికారులతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు అవగాహన కలిగించేటప్పుడు ఆడ బ్రూణ హత్యలను అరికట్టడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పోక్సో చట్టం గురించి, అబార్షన్ గురించి ప్రజలకు వి వరంగా తెలుపాలన్నారు. గర్బిణీ సమయంలో గర్భిణీ ఒకవేళ మానసిక సమస్యలతో బాధపడుతుంటే 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసే లా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ఒకవేళ గర్భస్థ శిశు లింగనిర్ధారణ చట్టం అతిక్రమించినట్లైతే వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా ఉంటుందన్నారు. సమావేశంలో హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ దమయంతి, మా తా శిశుసంరక్షణ ప్రోగ్రాం అధికారి ప్రసూనారా ణి, జిల్లా ఇమ్యూనేషన్ అధికారి తన్వీర్ రిజ్వా నా, ప్రోగ్రాం అధికారి రాజు, డిప్యూటీ డెమో మధుసూదన్‌రెడ్డి, డీవీఎల్‌ఎం నరేంద్రబాబు, హెల్త్‌అసిస్టెంట్ నర్సయ్య, డీసీపీవో నర్సింహు లు, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ జ్యోత్న, సఖి ఇన్‌చార్జి శోభారాణి, ఎన్‌జీవో ఉన్నారు.