చోరీలు, లైంగికదాడి కేసులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:00 PM
నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని, చోరీలు, లైంగిక దాడి కేసులను అత్యంత ప్రా ధాన్యతగా తీసుకుని వాటి క ట్టడి చేయాలని ఎస్పీ జానకి ఆదేశించారు.
- ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని, చోరీలు, లైంగిక దాడి కేసులను అత్యంత ప్రా ధాన్యతగా తీసుకుని వాటి క ట్టడి చేయాలని ఎస్పీ జానకి ఆదేశించారు. శుక్రవారం వార్షి క తనిఖీలలో భాగంగా రూర ల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ పరిశీలించారు. స్టేష న్‌లో అన్ని రికార్డులు, రిజిస్టర్లు, దర్యాప్తు ఫైళ్లను చూశారు. సిబ్బంది పనితీరు, క్రమశిక్షణ, ప్రజా సేవ ధోరణికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలోని పెండింగ్ కేసులను పరిష్క రించాలని, ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించేం దుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ విజయ్ తదితరులు పాల్గొన్నారు.