Share News

పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:19 PM

ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అంతటా పరిశుభ్రతను మెరుగు పర్చేందుకు మంగళవారం ఇంటెన్సివ్‌ పారిశుధ్య డ్రైవ్‌లతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌
ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న అధికారులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అంతటా పరిశుభ్రతను మెరుగు పర్చేందుకు మంగళవారం ఇంటెన్సివ్‌ పారిశుధ్య డ్రైవ్‌లతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. డెంగీ, మలేరియా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారేస్తున్న వ్యక్తులు, లేదా సంస్థలను గుర్తించి నోటీసులు జారీ చేసి జరిమానా విధించారు. ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న ఓపెన్‌ ప్లాట్‌లలో ఎక్స్‌కవేటర్‌తో క్లీన్‌ చేసి, యజమానులకు రూ.1000 జరిమానా విధించారు.

రోడ్లపై చెత్తవేస్తే జరిమానా

జడ్చర్ల : జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో రోడ్లపై చెత్తవేస్తే రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నట్లు జడ్చర్ల మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం పలు వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మునిసిపాలిటీ పరిధిలో ప్రతీ రోజు 25 టన్నుల చెత్త వస్తుందన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు జ్యోతికృష్ణారెడ్డి, చైతన్యగౌడ్‌, రమేశ్‌, నాయకులు నర్సిములు, శ్యామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:19 PM