Share News

జోగుళాంబ ఆలయంలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 06 , 2025 | 11:11 PM

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూరులోని ఐదవ శక్తి పీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

జోగుళాంబ ఆలయంలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు
జోగుళాంబ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

అలంపూరు, మే 6 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూరులోని ఐదవ శక్తి పీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి హరిత టూరిజం హోటల్‌ వద్ద ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఆలయానికి చేరుకున్న స్పీకర్‌కు ఆలయ చైర్మన్‌ కొంకల నాగేశ్వర్‌ రెడ్డి, ఈవో పురేందర్‌ కుమార్‌ పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారికి ఆలయంలో గణపతి పూజ, అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట పాలక మండలి సభ్యులు వెంకటేశ్వర్లు, నాగశిరోమణి, జగదీశ్వర్‌ గౌడ్‌, సీఐ రవి బాబు, ఎసైలు వెంకటస్వామి, మహేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:11 PM