కురుమూర్తిస్వామిని దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:11 PM
పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు.
సీసీకుంట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే రాష్ట్ర పశుసంవర్ధక , క్రీడల శాఖా మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలయ ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం, మేళతాలాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ విశిష్ఠతను అర్చకులు వివరించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో స్పీకర్‌తో పాటు మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ఈ ప్రభుత్వానికి స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. మరో ఐదేళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలని స్వామివారు దీవించాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కతలప్ప, ప్రశాంత్, కాంగ్రెస్ నేతలు నరేందర్‌రెడ్డి, వట్టెం శివకుమార్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు బందోబస్తును పర్యవేక్షించారు.